Wednesday, 4 November 2026

షర్మిల క్షమాపణ చెప్పాలి :జూపల్లి కృష్ణారావు

హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ అధినతే కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైఎస్సార్‌సీపీ నేత షర్మిలపై టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని కేసీఆర్‌కు భేషరుతుగా క్షమాపణ చెప్పాలని, లేకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. షర్మిల చేసిన  వ్యాఖ్యలు యావత్‌ తెలంగాణ ప్రజలను అవమానపరించే విధంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బయ్యారం గనులకు వైఎస్‌ కుటుంబానికి సంబంధం ఉన్న విషయం అందరికి తెలుసునని అన్నారు. బయ్యారం గనులకు వైఎస్‌ కుటుంబానికి సంబంధం ఉన్నట్టు ఆధారాలు కూడా ఉన్నాయని తెలియజేశారు. షర్మిల మాటల్లో ఎంత నిజాయితీ ఉందో అందరికీ తెలుసునని పేర్కొన్నారు. టీడీపీ వైఎస్సార్‌సీపీ రెండు పార్టీలు తెలంగాణకు ద్రోహం చేసిన పార్టీలేనని విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *