– కలెక్టర్ కు పిర్యాదు చేసిన మైనారిటీ నాయకులు.బెల్లంపల్లి, ఫిబ్రవరి 13, (జనంసాక్షి )
బెల్లంపల్లి పట్టణంలోని షాదీఖానాకు కేటాయించిన భూమిని రక్షించాలని కోరుతూ సోమవారం బెల్లంపల్లి ముస్లిం మైనారిటీ నాయకులు జిల్లా కలెక్టర్ కు ప్రజావాణిలో పిర్యాదు చేశారు. షాదీఖానాకు చెందిన భూమిని కొందరు వ్యక్తులు నకిలీ పట్టా పాస్ పుస్తకాలు సృష్టించి భూ ఆక్రమణకు ప్రయత్నిస్తున్నారని, అందులో నూతన నిర్మాణాలు చేపడుతున్నారని వారు వినతిపత్రంలో వివరించారు. నకిలీ పాస్ పుస్తకాలు అని తెలిసిన కూడా సంబంధిత అధికారులు అట్టి వ్యక్తులపై ఎలాంటి చర్యలు తీసుకోక పోగా కబ్జాదారులకు వత్తాసు పలికేలా వ్యవహరిస్తున్నారని వారు తెలిపారు. ఇట్టి కబ్జాను అరికడుతూ నకిలీ పట్టా పాస్ పుస్తకాలు సృష్టించిన సదరు వ్యక్తులపై, కబ్జాకు పాల్పడిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. వినతిపత్రం అందించిన వారిలో ముస్లిం మైనారిటీ నాయకులు గౌస్, అమానుల్లా ఖాన్, అమీర్ తదితరులు ఉన్నారు.




