Monday, 2 November 2026

వాల్వో బస్సు దగ్ధం.. ప్రయాణికులు సురక్షితం

అనంతపురం,ఆగస్టు 30: వాల్వో బస్సులో మంటలు అంటుకుని దగ్ధమైన సంఘటన అనంతపురం జిల్లా గార్లదిన్నెవద్ద చోటుచేసుకుంది.  హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్నవోల్వో బస్సు జిల్లాలోని గార్లదిన్నె వద్దకు చేరుకోగానే బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. గమనించిన డ్రైవర్ గాఢనిద్రలో ఉన్న ప్రయాణికులను అప్రమత్తం చేయడంతో పెను ప్రమాదం తప్పింది.   బస్సు ఏసీలో షార్ట్‌సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *