హైదరాబాద్ : ఐటీ అధికారులు కొరడా ఝళిపించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న షాపింగ్‌మాల్స్‌పై ఐటీ అధికారులు సోమవారం ఉదయం దాడులు నిర్వహించారు. పలుచోట్ల సోదాలు జరిపారు. హైదరాబాద్‌లోని నాలుగు షాపింగ్‌మాల్స్‌లో సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్‌తోపాటు విజయవాడలోనూ తనిఖీలు నిర్వహిస్తున్నారు. వ్యాపార లావాదేవీలను నిలిపివేసి ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. దీంతో వ్యాపారులు ఖంగుతిన్నారు. ఏం జరుగుతోందోతెలియని స్థితిలో చూస్తుండిపోయారు. షాపింగ్ మాల్స్‌లో సోదాలు జరుగుతుండడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వ్యాపారవర్గాలు అప్రమత్తమయ్యాయి. తమ షాపింగ్ మాల్స్ మూసేస్తున్నారు.




