హైదరాబాద్(జనం సాక్షి ): నగరంలోని సినీ మల్టీప్లెక్స్‌లపై ఏకకాలంలో తూనికలు,కొలతలశాఖ అధికారుల దాడులు జరిపారు. తినుబండారాలు, శీతలపానీయాలతో పాటు ఇతరు ఉత్పత్తులను అధిక ధరలకు విక్రయిస్తున్నారని ఫిర్యాదులు రావడంతో సోదాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ప్రసాద్ ఐమ్యాక్స్‌లో మూడు దుకాణాలపై కేసులు నమోదు చేశారు. నిబంధలు ఉల్లంఘించిన దుకాణాలపై కేసులు నమోదు చేస్తున్నారు. పంజాగుట్ల, అమీర్‌పేట్, దిల్‌సుఖ్‌నగర్, షామీర్‌పేట్, కూకట్‌పల్లి, మాదాపూర్, బంజారాహిల్స్ తదితర ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు.
షాపింగ్ మాల్స్ ల్లో అధికారుల దాడులు




