మంచిర్యాల పట్టణంలో గల సిఎంఆర్ షాపింగ్ మాల్ వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి మున్సిపల్ కమిషనర్ కు కార్యాలయంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా తెలంగాణ విద్యార్థి జన సమితి జిల్లా అధ్యక్షుడు బచ్చల ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ మంచిర్యాల పట్టణంలో అక్రమంగా షాపింగ్ మాల్ యాజమాన్యం రోడ్లను ఆక్రమించి దర్జాగా వ్యాపారం చేస్తున్నారు రోడ్లపై షాపింగ్ మాల్ సంబంధించిన సౌండ్ సిస్టం వ్యాపార ప్రకటనల కోసం మరియు ఇతర అవసరాల కోసం రోడ్లనే అడ్డగా మార్చుకొని వ్యాపారం చేస్తున్నారు అటు రైల్వే స్టేషన్ బస్టాండ్ మార్కెట్ వెళ్లేవారు షాపింగ్ మాల్ కు వచ్చే కస్టమర్ల వాహనాలు రోడ్లపై పార్కింగ్ చేయడం వల్ల ప్రజలు వాహనాలకు ఇబ్బందులకు గురై ఆక్సిడెంట్లు అవుతున్నాయి అదేవిధంగా షాపింగ్ మాల్ సౌండ్ సిస్టం విపరీతంగా పెట్టడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు ప్రక్కనే హాస్పటల్ ఉండటం వల్ల రోగులు ఇబ్బందులకు గురవుతున్నారు ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు చూసి చూడనట్టుగా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తూ షాపింగ్ మాల్ కు వత్తాసు పలుకుతున్నారు ఇప్పటికైనా అధికారులు సీఎంఆర్ షాపింగ్ మాల్ పై చర్యలు తీసుకొవలని డిమాండ్ చేసారు….




