జనంసాక్షి, కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ ఆదివరహాస్వామి దేవాలయంలో స్వామి వారిని తెలంగాణ రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ మంగళవారం దర్శించుకుని, పూజలు చేశారు. ఈ సందర్భంగా కమాన్పూర్ మాజీ జెడ్పిటిసి గంట వెంకటరమణారెడ్డి శాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.




