సంకల్ప సిద్ధి ఉంటే ప్రకృతి కూడా సహకరిస్తుంది ఢిల్లీ వసంత్

సంకల్ప సిద్ధి ఉంటే ప్రకృతి కూడా సహకరిస్తుందిఅనే నానుడి ఢిల్లీ వసంత్ ఆత్మీయ సమ్మేళనంలో మరోసారి నిరూపితమైంది. కుంభవృష్టి కురుస్తున్న, వాగులు పొర్లు తున్న జహీరాబాద్ ప్రజలు ఢిల్లీ వసంత్ పై అభిమానాన్ని మరోసారి నిరూపించారు. మొక్కవోని దీక్షతో మట్టి మనుషుల మనోగతం భూమి పుత్రుల ఆకలి కేక* అంటూ తన చాణిక్య నీతిని ప్రదర్శించిన ఢిల్లీ వసంత్ కు జహీరాబాద్ ప్రజలు నీరాజనం పట్టారు. ఈనాటి మట్టి మనుషుల మనోగతం కోసం జహీరాబాద్ మట్టిని సమ్మేళనం యొక్క వేదికపై ప్రదర్శించారు. ఆయా గ్రామాల అస్తిత్వాన్ని ఈ వేదికకు నాయకులుగా తీర్చిదిద్దారు. భూమి పుత్రుల ఆకలి కేక అంటూ జీవనాడిగా ఉన్న చక్కెర కర్మాగారం రక్షణకై వినూతన ప్రతిపాదన చేసి హౌరా అన్నట్టు ప్రపంచం గర్వపడేలా ఒక సమాధానాన్ని రాజ్యాధినేత అయిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారికి బహిరంగ వినతి పత్రం తో నివేదించారు.* ఆయన చిత్రపటాన్ని ఆత్మీయ సమ్మేళనం వేదికకు ముఖ్య అతిథిగా చేయడం ఢిల్లీ వసంత్ కే దక్కింది. ఆయన యొక్క మేధావితనం జహీరాబాద్ ప్రజలు ఈరోజు తనివి తీరా రుచి చూశారు. ముఖ్యమంత్రి చిత్రపటాన్ని వేదికపై ఉంచిన విధం బహుశా యావత్తు దేశంలో ఎవరు చేసి ఉండరు. అంతేకాకుండా తాను ఏకలవ్యుడి గా పని చేస్తానంటూ ముఖ్యమంత్రి మీద అభిమానంతో 72 గంటల పాటు సామూహిక ప్రార్థన ని ప్రకటించాడు . సత్యాగ్రహ సిద్ధాంతకర్త మన జాతిపిత అయిన మహాత్మా గాంధీ నేడు బతికి ఉంటే బహుశా ఢిల్లీ వసంత్ కు నమస్కరించే వాడేమో. కార్యక్రమం ముగిసిన తర్వాత హాజరు అయినటువంటి మహిళలు ఆయనకు ఆశీర్వదించే విధానం అందరికీ ఆకట్టుకుంది. ఏది ఏమైనా జయహో జహీరాబాద్ అనే స్థానిక నినాదంతో రెండున్నర సంవత్సరాలుగా చేసిన కృషికి ఫలితం తప్పకుండా దక్కాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో రైతులు, కార్మికులు, మహిళలు, వివిధ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు, లెక్చరర్లు, మేధావులు, నిరుద్యోగులు పాల్గొన్నారు. ఢిల్లీ వసంత్ లో బృంద సభ్యులైనమహిపాల్ యాదవ్, బిల్లీ పురం మాధవరెడ్డి, అశోక్ పాటిల్, విశాల్ గోడకే, రహీం ఖురేషి,రమేష్ బాబు కులకర్ణి, అబ్బాస్ మియా, రాజు, కరణం రవి, మల్లేష్ యాదవ్, పాపయ్య, విక్రమ్, ఆనంద్ ఈశ్వర్, హనుమంతు, ఓంకార్, యాసిర్ ఖాన్, బన్సీలాల్, ముదిగొండ శ్రీనివాస్, విష్ణు, శ్రీనివాస్, దినేష్, గోవింద్ రెడ్డి, భూమన్ స్టీవెన్సన్, అనిల్, శంకరయ్య, ఖాదర్, బాలకృష్ణ, హమీద్ సాబ్, గోపాల్ మరియు సీనియర్ జర్నలిస్టు దుర్గం రవీందర్ గారు, వాసుదేవరెడ్డిలు పాల్గొన్నారు.

తాజావార్తలు