ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డిని కలిసిన ఆర్ఎంపీ, పీఎంపీలు

హుజూరాబాద్, సెప్టెంబర్ 4 (జనంసాక్షి) :ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డిని ముఖ్యమంత్రి కేసిఆర్ హుజూరాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్ధిగా ప్రకటించిన సందర్భాన్ని పురస్కరించుకొని విఘ్నేశ్వర ఆర్ఎంపీ, పీఎంపీల సంఘం నాయకులు సోమవారం స్థానిక బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్చం అందించి శాలువతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ… రాబోయే ఎన్నికలలో గ్రామీణ ప్రాంతాల వైద్యులు ఆర్ఎంపీ, పీఎంపీలు తమకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆర్ఎంపీ, పీఎంపీలకు ఎలాంటి సమస్యలున్న ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరిస్తానని వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు కందగట్ల శ్రీనివాస్, ఉపాధ్యక్షులు ఎర్రోళ్ల సదానందం, కన్నబోయిన తిరుపతి, ప్రధాన కార్యదర్శి చిలుకమారి శ్రీనివాస్, కోశాధికారి కమలాసింగ్, హుజూరాబాద్ డివిజన్ జనరల్ సెక్రటరీ కొక్కుల రవీందర్. రామరాజు, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు