Wednesday, 4 November 2026

సంక్షేమ పథకాలను జనంలోకి తీసుకెళ్లాలి

సంక్షేమ పథకాలను జనంలోకి తీసుకెళ్లాలిప్రతీ కార్యకర్త సైనికుడిగా పనిచేయాలిప్యానల్ స్పీకర్ ఎమ్మెల్యే షిండేబిచ్కుంద మార్చి 26 (జనంసాక్షి)
బీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో ఆత్మీయ సమ్మేళనాల జోష్‌ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో 9 ఏండ్ల కాలంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని తద్వారా రాష్ట్రంలో మూడోసారి అధికారంలోకి రావాలనే పట్టుదల గులాబీల్లో నెలకొన్న దృశ్యాలు ఆత్మీయ సమ్మేళనాల్లో దర్శనమిస్తున్నాయి. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని బిచ్కుంద మండలంలో గల వాజిద్నగర్ గ్రామంలో ఆదివారం నాడు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ప్యానల్ స్పీకర్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని హర్షం వ్యక్తం చేశారు. కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, రైతు బంధు పథకం, ముఖ్యమంత్రి సహాయనిధి పథకం, రైతు భీమా పథకం, గర్భిణులకు బాలింతలకు పౌష్టికాహారం, వృద్ధులకు, వికలాంగులకు పెన్షన్లు, బతుకమ్మ రంజాన్ కానుకలు మరియు ఇతర అనేక పేదల, మహిళల సంక్షేమ పథకాలు భారత రాష్ట్ర సమితి ఎన్నో కోట్ల రూపాయలు వెచ్చించి పథకాలు అమలు చేస్తోందని పేర్కొన్నారు. వీటిని ప్రజల్లోకి తీసుకెళ్ళే బాద్యత మనదేనని, కార్యకర్తలదేనని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ అనూయ లక్ష్మీ నారాయణ, అశోక్ పటేల్, నాల్చర్ రాజు, అసద్ అలీ, వెంకట్రావు దేశాయ్, నాగ్నాథ్ పటేల్, బి సాయిలు, ఆకుల సాయిలు, డాక్టర్ రాజు, ధన్సింగ్, విజయలక్ష్మీ భూంశెట్టి, యాదవ్ మరియు వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.