సంక్షేమ పథకాలు కార్మికులందరికీ చేరే విధంగా చూస్తా

హుజూర్ నగర్ ఏప్రిల్ 4 (జనం సాక్షి): ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలు కార్మికులందరికీ చేరే విధంగా చూస్తానని హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. బి ఆర్ ఎస్ టి యు అనుబంధ హుజూర్ నగర్ బజార్ అమాలి సంఘం మంగళవారం ఆ సంఘ అధ్యక్షులు ఉపేందర్ అధ్యక్షతన ఎమ్మెల్యే సైదిరెడ్డి ని మర్యాదపూర్వకంగా కలవడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సైదిరెడ్డి మాట్లాడుతూ కార్మికులకు అన్ని సంక్షేమ పథకాలు అందే విధంగా చూస్తానన్నారు. కార్మికులకు ఏమైనా సమస్యలు ఉన్న నా దృష్టికి తీసుకొని రాగలరు అని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కార్మిక సంఘం అధ్యక్షులు పచ్చిపాల ఉపేందర్, అమాలి అధ్యక్షులు బాలకృష్ణ, నరసింహారావు, నాగరాజు, లింగయ్య, వెంకన్న, రామయ్య, వెంకన్న, కోటయ్య, వీరబాబు తదితరులు పాల్గొన్నారు.