టీఎస్ హెచ్ డి సి చైర్మన్ చింత ప్రభాకర్
సంగారెడ్డి బ్యూరో, జనం సాక్షి, జూన్ 27 : –
సంగమేశ్వర బసవేశ్వర ద్వారా సంగారెడ్డి స్వస్యశ్యామలంగా మారుతుందని రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పేర్కొన్నారు. మంగళవారం సదాశివపేట మండలం నందికంది గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం అధ్వర్యంలో రాయితీ విత్తనాల పంపిణీ కార్యక్రమాని ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చింతా ప్రభాకర్ హాజరై రైతులకు రాయితీ విత్తనాల పంపిణ. రైతులకు సబ్సిడీ ద్వారా మంజూరై వంద క్వింటల్లా జనుములు విత్తనాలు రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా చింతా ప్రభాకర్ మాట్లాడుతూ సంగమేశ్వర బసవేశ్వర ద్వారా 80 వేల ఎకరాలకు సాగు నీరు అందుతుందని తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో దేశానికే ఆదర్శం అన్నారు. దేశంలోని రాష్ట్రాలు తెలంగాణ పాలన కావాలని కోరుతున్నారన్నారు. రైతుల పక్షపాతిగా కేసిఆర్ పాలన కొనసాగుతుందన్నారు. 24 గంటల, కరెంట్, దేశానికే ఆదర్శంగా పథకాలు కేసిఆర్ తోనే సాధ్యం అన్నారు.
రైతులకు మేలు చేస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని సీఎం కేసీఆర్ కు అండగా ఉండి మూడోసారి అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. నంది కంది గ్రామం అంటే నాకు చాలా అభిమానం అని నంది కంది గ్రామ ప్రజల మద్దతు ఎల్లవేళలా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాజు, కొండల్ రెడ్డి, వ్యవసాయ అధికారులు, రైతులు పాల్గొన్నారు.




