Tuesday, 3 November 2026

సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ చేసిన టి హెచ్ డి సి చైర్మన్  చింతా ప్రభాకర్

 

సంగారెడ్డి బ్యూరో, జనం సాక్షి, జూన్ 27: –

సంగారెడ్డి నియోజకవర్గం సదాశివపేట మండలం మద్దికుంట గ్రామానికి చెందిన పూజ కుటుంబ సభ్యులకు అత్యవసర చికిత్స నిమిత్తం సీఎం సహాయ నిధి పథకం కింద మంజూరైన రూ. 2 లక్షల 50 వేల ఆర్థిక సాయం మంజూరు పత్రాలను మంగళవారం రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్ తన నివాసంలో అందించారు. ఈ సందర్భంగా చింతా ప్రభాకర్ మాట్లాడుతూ పేదరికంతో బాధపడుతూ అనారోగ్యాల బారిన పడుతున్న వారికి వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సాయం అందించటం ద్వారా ప్రభుత్వం భరోసాగా నిలుస్తున్నదన్నారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఇందుకు కృషి చేసిన చింతా ప్రభాకర్ కు పూజ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి అరిపోద్దిన్, మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మెన్ సుధీర్ రెడ్డి, యదా గౌడ్, సర్పంచులు, సిద్దన్న, కుమార్, తదితరులు పాల్గొన్నారు.