సంగారెడ్డి నియోజక వర్గం నుండి నేను పోటీకి రెడీ

 

 

సంగారెడ్డి నియోజకవర్గంలో నా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉందిఅధిష్టానం ఆశీర్వదిస్తే కాంగ్రెస్ పార్టీ నుండి పోటీకి రెడీరాష్ట్ర లింగ బలిజ అధ్యక్షులు సంగమేశ్వర్సంగారెడ్డి బ్యూరో,  జనం సాక్షి ,  ఆగస్టు 21  : కాంగ్రెస్ పార్టీ తరఫున సంగారెడ్డి నియోజక వర్గం నుండి నేను పోటీకి రెడీ ,  సంగారెడ్డి నియోజకవర్గంలో నా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉందనీ,  కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆశీర్వదిస్తే కాంగ్రెస్ పార్టీ నుండి పోటీకి రెడీ ఉన్నాననిరాష్ట్ర లింగ బలిజ అధ్యక్షులు సంగమేశ్వర్ అన్నారు.

సోమవారం పోతిరెడ్డిపల్లి మంజీరా హోటల్లో సంగమేశ్వర్ తన అనుచరులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు . ఈ సందర్భంగా సంగమేశ్వర్ మాట్లాడుతూ  తనకు సంగారెడ్డి నియోజకవర్గం అంటే చాలా ఇష్టమని తనకు సంబంధించిన ఓటర్లు దాదాపు 30 వేలమంది ఉన్నారని, తాను ప్రయత్నం చేస్తే గెలుపొందడం ఖాయమని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు . తాను తన అనుచరులతో కలిసి గాంధీభవన్లో దాని పూడి చేయడానికి సిద్ధంగా ఉన్నానని తనకు సంగారెడ్డికి సీటు కేటాయించాలని  వినతిపత్రాన్ని సమర్పించినట్టు ఆయన తెలిపారు. ఈ విషయంపై అధిష్టానం కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందని , తప్పకుండా నాకు సీట్ కేటాయిస్తే సంగారెడ్డి నుండి గెలుపొందడం ఖాయమన్నారు . తాను గతంలో అరవెల్లి సర్పంచ్ గా , డైరెక్టర్గా, కూల్ చైర్మన్ గా  పనిచేసిననని ఈ సందర్భంగా గుర్తు చేశారు. సదాశివపేట, సంగారెడ్డి, కొండాపూర్, అలాగే సంగారెడ్డి సదస్సు పట్టణాల్లో కూడా తమ ఓటర్లు చాలా ఉన్నారని వారందరూ తనను కోరుకుంటున్నారన్నారు . ఈ సందర్భంగా కాంగ్రెస్ కమిటీ శాశ్వత సభ్యులుగా  ఎన్నుకోబడిన దామోదర్ రాజనర్సింహకు  ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అలాగే రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు . ఈ కార్యక్రమంలో లింగ బలిజ జిల్లా అధ్యక్షులు మల్లికార్జున్ పాటిల్, నాయకులు శేఖర్, రాములు, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.