సంజయ్‌ దత్‌కు అయిదేళ్ల జైలు

న్యూఢిల్లీ : బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌కు సుప్రీంకోర్టు గురువారం అయిదేళ్ల జైలు శిక్ష విధించింది. అక్రమంగా ఆయుధాలు కలిగిన కేసులో ఆయనకు న్యాయస్థానం ఈ శిక్ష ఖరారు చేసింది. ఇప్పటికి 16 నెలల జైలుశిక్ష అనుభవించిన సంజయ్‌ దత్‌ ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు. కోర్టు తీర్పుతో ఆయన మరో మూడున్నరేళ్లు శిక్ష అనుభించాల్సి ఉంది. నాలుగు వారాల్లో లొంగిపోవాలని కోర్టు ఆదేశించింది.