Wednesday, 4 November 2026

సంతానం లేదని సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్య

కూకట్‌పల్లి : సంతానం కలగడం లేదని ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కూట్‌పల్లి వివేక్‌నగర్‌లో నివాసం ఉండే పిల్లి ఉదయ్‌కుమార్‌ (32) సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. 2008లో రాదికతో వివాహం జరిగిం ది. కానీ ఇప్పటి వరకు సంతానం కలగకపోవడంతో మనోవేధనకు గుర య్యాడు. బుధవారం ఉదయం తన భార్య రాధిక గుడికెళ్లిన సమయంలో ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యు లు ఇచ్చిన సమాచారం మేరకు కూకట్‌పల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరకుని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించా రు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *