Wednesday, 4 November 2026

31 నుంచి హజ్‌ యాత్రికులకు శిబిరాలు

నాంపల్లి : రెండు తెలుగు రాషా్ట్రల నుంచి ఈ దఫా సుమారు 7,000 మంది ముస్లింలు హజ్‌ యాత్రకు వెళ్లనున్నారు. యాత్రికులకు బస, అవగాహన శిబిరాలు, విమానాల్లో పంపడం వంటి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏర్పాట్లలో భాగంగా ఈ నెల 31 నుంచి యాత్రికులకు శిబిరాలను నిర్వహించనున్నారు. హజ్‌ యాత్రకు ఎంపికైన యాత్రికులు 48 గంటల ముందే నాంపల్లిలోని హజ్‌ భవన్‌లో రిపోర్టు చేయాలని హజ్‌ కమిటీ ప్రత్యేక అధికారి ప్రొఫెసర్‌ ఎస్‌.ఎ.షూకుర్‌ కోరారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ర్టాలతోపాటు కర్నాటకలో రాయిచుర్‌, గుల్బార్గ, బీదర్‌, ఉద్గీర్‌ తదితర ప్రాంతాలకు చెందిన యాత్రికులను ఇక్కడి నుంచే పంపిస్తామని తెలిపారు. యాత్రికులకు ఉచిత బస, భోజనం తదితర ఏర్పాట్లు చేస్తున్నామని, ఇలా ప్రతి రోజూ 2500 మంది ఇక్కడే ఉండేలా అన్ని చర్యలూ తీసుకుంటున్నామని వివరించారు. సెప్టెంబర్‌ 2 నుంచి 8 వరకు ప్రతి రోజూ నాలుగు గంటల ముందే ఇక్కడి నుంచి యాత్రికులను శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకి తరలిస్తామని, దీనికి కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *