Thursday, 5 November 2026

సంభాని అధ్వర్యంలో హాథ్ సే హాథ్ జో డో యాత్రసంభాని అధ్వర్యంలో హాథ్ సే హాథ్ జో డో యాత్ర

పెనుబల్లి, మార్చ్ 18(జనం సాక్షి)టి పి సి సి సీనియర్ ఉపాధ్యక్షులు సంభాని చంద్రశేఖర్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న హాత్ సే హా త్  జోడో యాత్ర శనివారం పెనుబల్లి మండలం లో నాయకులు,కార్యకర్తలతో కలిసి సూరయ్యబంజర, సూరయ్యబంజర తండా, గనేష్ పాడు, ముత్తగూడెం గ్రామాల్లో నిర్వహించారు,ఈ సందర్భంగా సంభాని చంద్రశేఖర్  మాట్లాడుతూగత తొమ్మిదేళ్ల కెసిఆర్ పాలనలో ప్రజలకు ఒరిగింది ఏమి లేదని అన్నారు,ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్బడుతున్న కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగట్టారు,కాంగ్రెస్ పాలనలో వ్యవసాయాన్ని పండుగలా చూశారని తెలిపారు, పేదల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ పనిచే సిందని,లక్షల ఇందిరమ్మ ఇళ్లు, వేలకోట్ల రూపాయల పంట రుణాలు మాఫీ చేశామని అన్నారు, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం తెచ్చామని, పేద ప్రజలకు  వైద్యం అందించాలని ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీయేనని అన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే రూ.5లక్షలతో ఇందిరమ్మ ఇళ్లను ఇస్తామని, రూ.500లకు గ్యాస్‌ సిలిండర్‌ ఇస్తామని, రూ.2లక్షల వరకు రుణమాఫీ కల్పిస్తామని, రైతులకు కరెంట్‌, నిరద్యోగులకు ఉద్యోగాలు, విద్యార్థులకు ఫీజు రియింబర్స్‌మెంట్‌ తదితర పథకాలను అమలు చేస్తామని అన్నారు,కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెలికాని రాజబాబు, పెనుబల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు వడ్లమూడి కృష్ణయ్య, ఈడా కమలాకర్, మేకతొట్టి కాంతయ్య, హరిబాబు, మామిళ్ళ వెంకటేశ్వర్లు, గద్దె శ్రీను, దేవేంద్రబాబు, కాకా వెంకటేశ్వర్లు, పకీర్ సాహెబ్, మధు, బల్లికాసులు, బెల్లంకొండ సీతారాములు, గడిపర్తి శ్రీను, మధు, రామకృష్ణా రెడ్డి,నాగేశ్వరరావు, సత్యనారాయణ, లింగయ్య, కేలోతు సురేష్ నాయక్, గుగులోతు రాంసింగ్, తదితరులు పాల్గొన్నారు.