Wednesday, 4 November 2026

సంభాని నేతృత్వంలో జోరుగా హాథ్ సే హాథ్ జోడో అభియాన్ కార్యక్రమం.

 

 

 

 

 

 

 

 

 

పెనుబల్లి, ఫిబ్రవరి 9(జనం సాక్షి)ఏఐసిసి, టిపిసిసి పిలుపు మేరకు, రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర స్ఫూర్తితో గురువారం 4వ రోజు పెనుబల్లి మండలంలోని గంగదేవిపాడు, తాళ్ళపెంట, బ్రహ్మాలకుంట, కర్రాలపాడు గ్రామాలలో మాజీ మంత్రి, టి పి సి సి సీనియర్ ఉపాధ్యక్షులు సంభాని చంద్రశేఖర్ హాథ్ సే హాథ్ జోడో అభియాన్ కార్యక్రమాన్ని కాంగ్రెస్ జెండా ఆవిష్కరణతో ప్రారంభిం చారు, అనంతరం గంగదేవిపాడు, తాళ్ళపెంట, బ్రహ్మాలకుంట, కర్రాలపాడు గ్రామాల్లో గడప గడపకు తిరుగుతూ బి జె పి, బి ఆర్ ఎస్ ప్రభుత్వాల ద్వందనీతిని, అధికారం కోసం చేసిన మోసపూరిత హామీలను ప్రజలకు వివరించే కార్యక్రమం చేపట్టారు, రాహుల్ గాంధీ సందేశం ఉన్న కరపత్రాలను అందిం చారు,కాంగ్రెస్ పార్టీ ప్రజలకు కోసం చేపట్టిన సంక్షేమ పథకాలను, కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధిని తెలియజేసారు. ముఖ్యంగా రైతుల కోసం రూపొందించిన వరంగల్ రైతు డిక్లరేషన్ గురించి వివరించి రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెలికాని రాజబాబు, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ సెక్రెటరీ రామిశెట్టి మనోహర్ నాయుడు, రాష్ట్ర ఎస్ సి డి పి టి కన్వీనర్ కొండూరు కిరణ్, సత్తుపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శివ వేణు, కల్లూరు మండల కాంగ్రెస్ అధ్యక్షులు పెద్దబోయిన దుర్గాప్రసాద్, వడ్లమూడి కృష్ణయ్య, ఈడా కమలాకర్, చిలుకు బత్తుల చెన్నారావు,గద్దె శ్రీను, మేకతొట్టి కాంతయ్య, కాకా వెంకటేశ్వర్లు, మరకాల నర్సింహరెడ్డి, పరసా ప్రసాద్, మోహనరావు, మండల ఎస్ సి సెల్ తేల్లూరి శ్రీనివాస రావు, బొర్రా రవి, భోగి నర్సింహారావు, బడ్డయ్య, బెల్లంకొండ సీతారాములు, పకీర్ సాహెబ్, జిల్లెళ్ళ నర్సింహస్వామి, అన్నపురెడ్డి లక్ష్మయ్య, గుజ్జా వెంకటేశ్వర్లు, యూత్ కాంగ్రెస్ నాయకులు సురేష్, సోషల్ మీడియా కోఆర్డినేటర్ కాసులు తదితరులు పాల్గొన్నారు.