–
తహసిల్దార్ భగవాన్ రెడ్డి ఆధ్వర్యంలో…బూర్గంపహాడ్ ఫిబ్రవరి 09 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గుంపహాడ్ తహసిల్దార్ ఆధ్వర్యంలో గురువారం వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో మోతి గడ్డ శ్రీ వీరభద్ర స్వామి వారి దేవస్థానం నందు జరుపబడు మహా శివరాత్రి జాతర ఏర్పాట్ల గురించి అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ, పోలీసు శాఖ, పంచాయతీరాజ్ శాఖ, ఎక్సైజ్ శాఖ, విద్యుత్ శాఖ, గ్రామపంచాయతీ సెక్రెటరీ మోతీ పట్టి నగర్, దేవాదాయశాఖ కార్యనిర్వహణాధికారి జి సుదర్శన్, దేవాదాయ ధర్మాదాయ శాఖ కొత్తగూడెం డివిజన్ ఇన్స్పెక్టర్ శ్రీబెల్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల వారు చేయవలసిన పనుల గురించి తాసిల్దార్ భగవాన్ రెడ్డి తగు సూచనలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ బిక్కసాని శ్రీనివాస రావు, గ్రామ సర్పంచ్ సూరమ్మ పాల్గొన్నారు.




