Wednesday, 4 November 2026

సంరక్ష హాస్పిటల్ చైర్మన్ గా  డాక్టర్ దొడ్డ రమేష్ కుమార్ బాధ్యతల స్వీకరణసంరక్ష హాస్పిటల్ చైర్మన్ గా  డాక్టర్ దొడ్డ రమేష్ కుమార్ బాధ్యతల స్వీకరణ

వరంగల్ ఈస్ట్, మే 24 (జనం సాక్షి)వరంగల్ నగరంలోని ప్రముఖ సంరక్ష సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నూతన చైర్మన్గా డాక్టర్ దొడ్డ రమేష్ కుమార్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు అలాగే వైస్ చైర్మన్ గా డాక్టర్ తిరుపతిరెడ్డి మేనేజింగ్ డైరెక్టర్ గా డాక్టర్ శ్రవణ్ కుమార్ మెడికల్ డైరెక్టర్గా డాక్టర్ అజిత్ అహ్మద్ లు కూడా బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా చైర్మన్ డాక్టర్ రమేష్ కుమార్ మాట్లాడుతూ పేద ప్రజలకు వైద్యం అందించడంలో జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో కూడా ఉన్నతమైన ఉత్తమమైన సేవలందించేందుకు ప్రతి ఒక్క సంరక్ష కుటుంబ సభ్యులు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు తనుజారాణి, ఉషారాణి  సంధ్యారాణి, చంద్రశేఖర్ ఆర్య ,రామచంద్ర ధరక్, లక్ష్మీ దీపక్  బందెల మోహన్ రావు  పోలా నటరాజ్, మోహన్ రావు  మదన్  శ్రవణ్, పద్మ ,మల్లేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.