రుద్రుర్ (జనంసాక్షి): రుద్రుర్ మండల కేంద్రంలో సత్యాగంగా పౌర్ణమి పూజలను గంగమ్మ గుడి వద్ద అంగారంగా వైభవంగా నిర్వహించారు,ప్రతీ సంవత్సరం జేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున బోయీ సంఘం నుండి గ్రామ ప్రజలతో కలిసి బోనాలతో వెళ్ళి గంగాదేవికి ఓడిబియ్యం , దీపదుప నైవేద్యలతో పూజించి
చెరువులో తెప్ప విడిచారు, అక్కడే ఉన్న పాపనాగమ్మ వద్ద కూడా కొబ్బరి కాయలు కొట్టి పూజ కార్యక్రమలు నిర్వహించారు. అనంతరం బోయీ సంఘం వారు ఏర్పాటు చేసిన అన్నదానంలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు ఈ పూజ కార్యక్రమనికి మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు పాల్గొన్నారు , గంగమ్మ గుడివద్ద
రోడ్డు ఇరుకుగా మారి ప్రమాదకరంగా మారిందని గ్రామ ప్రజలు చర్చించుకున్నారు, రోడ్డుకు ఇరువైపులా మొరం పోసి రోడ్డును పెద్దగా చేస్తే బాగుంటుందని కోరుకున్నారు
ఈ కార్యక్రమంలో బోయి సంఘం అధ్యక్షులు నీలం సాయిలు , ఉప అధ్యక్షులు దాలమల్కా పెద్దయ్య
కార్యదర్శి ఉరడి శంకర్, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.





