Monday, 2 November 2026

సబిత రాజీనామా కోరడం సరికాదు : ఎంపీ గుత్తా

హైదారాబాద్‌ : హోం మంత్రి సబిత రాజీనామా చేయాలని విపక్షాలు కోరడం సరికాదని ఎంపీ గుత్తా సుఖేందర్‌ రెడ్డి అన్నారు. ఈ రోజు ఇక్కడ ఆయన ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డిని కలిశారు. అనంతరం మాట్లాడుతూ కేసుల వ్యవహారం కోర్టులో ఉన్న సమయంలో రాజీనామా కోరడం ఏమిటని ప్రశ్నించారు. కేసులపై ఏం చేయాలనేది ముఖ్యమంత్రి, పార్టీ అధిష్టానం చూసుకుంటారని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *