Monday, 2 November 2026

సభా ప్రాంగణానికి చేరుకుంటున్న నేతలు

హైదరాబాద్‌,(జనంసాక్షి): హైదరాబాద్‌లో తెలంగాణ సాధన సభ హడావిడి కొనసాగుతుంది. నిజాం కళాశాలకు భారీగా తెలంగాణవాదులు చేరుకుంటున్నారు. ఇప్పటికే ముఖ్య నేతలు సభా ప్రాంగణానికి చేరుకున్నారు. మంత్రి జానారెడ్డి, ఎంపీలు పొన్నం ప్రభాకర్‌, రాజయ్య, మధుయాష్కీ, గుత్తా సఖేందర్‌రెడ్డి, సీనియర్‌ నేత షబ్బీర్‌ అలీ చేరుకున్నారు. జై తెలంగాణ నినాదాలతో సభా ప్రాంగణం మార్మోగుతుంది. నిజాం కళాశాల వద్ద పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *