Wednesday, 4 November 2026

అనంతలో 3కోట్ల గల్లంతుపై కలెక్టర్‌ ఆరా

అనంతపురం,మార్చి 25(జ‌నంసాక్షి): అనంతపురం జిల్లా నీటి యాజమాన్య సంస్థలో రూ. 3 కోట్ల మేర నగదు గల్లంతైనట్లు జిల్లా కలెక్టర్‌ కోన శశిధర్‌ తన తనిఖీల ద్వారా గుర్తించారు. దీంతో ఈ అంశంపై విచారణకు ఆయన బుధవారం ఆదేశించారు. ఈ కేసులో దోషులు ఎంతటి వారైనా వారిని వదిలిపెట్టమని ఆయన తెలిపారు. నిందితులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. గత ఏడాది ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు ఉపాధి కూలీలకు డబ్బు చెల్లించ లేదని కలెక్టర్‌ కోన శశిధర్‌ తన తనిఖీల్లో గుర్తించారు. వివిధ సందర్భాల్లో ఈ మొత్తం గల్లంతయ్యిందని గుర్తించి విచారణకు ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *