Tuesday, 3 November 2026

సమయపాలన పాటించని అధికారులు ఆందోళన

సమయపాలన పాటించని అధికారులు ఆందోళన చెందుతున్న రైతులు, పదర మండల కేంద్రంలోని వివిధ ప్రభుత్వ ఎంపీడీవో, తాసిల్దార్, తదితర కార్యాలయాల్లో పనిచేస్తున్న అధికారులు సమయపాలన పాటించకపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు, ప్రజలు తమకు అవసరమైన వివిధ రకాల ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందడం కోసం అవసరమైన సర్టిఫికెట్ల కోసం కార్యాలయానికి వస్తుంటారు, అదేవిధంగా రైతులు విరాసత్ కోసం, ధరణిలో ఉన్న పొరపాట్లను సరి చేసుకోవడం కోసం కార్యాలయానికి వస్తుంటారు, అయితే అధికారులు సమయపాలన పాటించకుండా సకాలంలో రాక పోవడంతో కార్యాలయాల ముందు అడిగా పడిగాపులు కాయాల్సి వస్తుందని ప్రజలు, రైతులు ఆరోపిస్తున్నారు, సంబంధిత అధికారులు స్పందించి అన్ని శాఖల అధికారులు సమయపాల పాటించి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు