నిర్మల్ బ్యూరో, నవంబర్30,, మూడవ రోజుపాదయాత్రలో భాగంగా… గుండెగాం గ్రామ సమీపంలోని పత్తి చేలలో కూలి పనులు చేస్తున్న కూలీల వద్దకు వెళ్లి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్న బండి సంజయ్
మాకు రెక్కాడితే గానీ, డొక్కాడదని బండి సంజయ్ ఎదుట తమ గోడు వెళ్లబుచ్చిన కూలీలు
మాకు ఇండ్లు లేవు… పెన్షన్లు రావడం లేదు – బండి సంజయ్ తో కూలీలు
తెలంగాణ ప్రభుత్వం బీడీ కార్మికులకు రూ. 2000 పెన్షన్ ఇస్తోంది… కనీసం మాలాంటి నిరుపేద కూలీలకు రూ. 1000 అయినా పెన్షన్ ఇవ్వాలని కోరుతున్నాం – బండి సంజయ్ తో కూలీలు
మాకు ఇండ్లు, పెన్షన్స్ వచ్చేలా చూడండి… మమ్మల్ని ఆదుకోండి – బండి సంజయ్ తో కూలీలు
అనంతరం కూలీలతో బండి సంజయ్…
ఉపాధి హామీ పథకం కింద కేంద్ర ప్రభుత్వం మీకు ఉపాధి కల్పిస్తోంది
ఉపాధి హామీ పథకం నిధులను కూడా కేసీఆర్ దారిమల్లిస్తున్నాడు
తెలంగాణలో పెద్దల రాజ్యం పోవాలి… పేదల రాజ్యం రావాలి
మోడీ పేదోడు… తెలంగాణలో కూడా పేదోళ్ల రాజ్యం వస్తేనే, మీకు న్యాయం జరుగుతుంది
వచ్చేది బిజెపి ప్రభుత్వమే…
మన ప్రభుత్వం వచ్చాక మీకు అండగా ఉంటాం… మిమ్మల్ని ఆదుకుంటాం




