Thursday, 5 November 2026

సమయపాలన పాటించని పంచాయతీ కార్యదర్శి

 

 

 

 

 

జనం సాక్షి/ కొల్చారంప్రజలకు నిరంతరం సేవలు అందించాల్సిన పంచాయితీ కార్యదర్శి సకాలంలో విధులు నిర్వహించకపోవడం తో ప్రజల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొల్చారం మండలం తుక్కాపూర్ పంచాయతీ కార్యదర్శి ఎప్పుడు విధులకు వస్తారో ఎప్పుడు ఎవరారో తెలియని పరిస్థితి గ్రామంలో నెలకొంది. గ్రామంలో సమస్యలు రాజ్యమేలుతున్న పంచాయతీ కార్యదర్శి గ్రామ సమస్యలు ఇవి పట్టించుకోకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం వరి ధాన్యం కొనుగోలు పనులు వేగంగా జరుగుతున్న సమయంలో రైతు గ్రామానికి చెందిన రైతులు విద్యార్థులు యూపీఐ ఫోన్ నెంబర్ లింక్ కోసం పంచాయతీ కార్యదర్శి సంతాకాల కోసం రోజుల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి గ్రామస్తులకు ఏర్పడింది. తరచూ విధులకు డుమ్మా కొట్టడంతో పంచాయితీ కార్యాలయంలో ఖాళీ కుర్చీలే దర్శనమిస్తున్నాయి. తమ సమస్యను
ఎవరికి చెప్పుకోవాలో తెలియక ప్రజలు అయోమయ పరిస్థితిలో ఉన్నారు. ప్రజలకు సమాధానం చెప్పే అధికారులు లేకపోవడంతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామపంచాయతీ అధికారులు. సిబ్బంది సమయపాలన పాటించడం లేదని గ్రామస్తు తెలిపారు. ఎప్పుడు గ్రామపంచాయతీ కార్యాలయానికి వచ్చిన కాళీ కుర్చీలతో దర్శనమిస్తున్న అని వాపోతున్నారు. గ్రామంలోని సమస్యను ఎవరికి చెప్పుకోవాలి తెలియక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు వాపోతున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామ పంచాయతీ సిబ్బంది సమయపాలన పాటించి విధంగా చర్యలు తీసుకోవాలి డిమాండ్ చేస్తున్నారు.