Thursday, 5 November 2026

విద్యార్థులను సన్మానించిన శీను బాబు

 

 

 

 

 

 

 

 

జనంసాక్షి, కమాన్ పూర్ : పదవ తరగతి పరీక్ష లో ప్రతిభ చాటిన విద్యార్థులను గురువారం దుద్దిల్ల శ్రీను బాబు శాలువాలతో సన్మానించి అభినందించారు. కమాన్ పూర్ మండలంలోని రొoపికుంట గ్రామానికి చెందిన బోట్ల రమ్య శ్రీ పదవ తరగతి పరీక్షల్లో 10/10 జిపిఏ రాగా, సిద్దిపల్లే గ్రామాలకి చెందిన మాడిచెట్టి రామ్ మోహన్ 10 /10 జిపిఏ రాగా, శాలపల్లి గ్రామానికి చెందిన మచ్చ కావేరి 9.8/10 జిపిఏ, తాటికొండ అక్షయ 9.8/10, మాటేటీ మారుతి 9.5/10, సామల మహేష్ 9.5/10 జిపిఏ వారి వారి ఇంటికి స్వయంగా శ్రీనుబాబు వెళ్లి శాలువతో సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమాల్లో మండల కాంగ్రెస్ అధ్యక్షులు వైనాల రాజు, రొంపికుంట, పేరపల్లి సర్పంచులు కటకం రవీందర్, తొగరి అన్నపూర్ణ అశోక్, గ్రామ శాఖ అధ్యక్షులు కోల నరేందర్, గడ్డం శీను, చొప్పరి శేఖర్, ఉపసర్పంచ్ గుమ్మడి సతీష్ , జెమిని గౌడ్, కమ్మగోని మల్లయ్య, కుందార బాపు, కటకం నారాయణ, పెండ్యాల రాజు, గుమ్మడి శ్రీనివాస్, లింగాల రాజన్న, కోల నర్సాగౌడ్, పడాల మల్లేష్, గుమ్మడి సంజీవ్, ప్రకాష్, బొంగోని సదయ్య, బొంగుని వీరేష్ , బూస తిరుపతి, బొజ్జ సతీష్, కుక్క రవి, ఇక్బాల్, సుమన్, చిప్ప రాజకుమార్ బిల్లా వెంకటేష్, బిల్లా కృష్ణ, ఇరుగురాల శేఖర్, ఇరుగురాల రాజు, దాడి మురళి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.