Tuesday, 3 November 2026

సమస్యను పరిష్కరించాలంటూ కార్యదర్శి నిర్భందం

కొత్తకోట గ్రామీణం: మండలంలోని రామానంతపూర్‌ గ్రామపంచాయతీలో నెలకొన్న మంచినీరు. వీధి దీపాలు, మురుగుకాల్వల నిర్మాణం, వాటి శుభ్రత వంటి సమస్యలను పరిష్కరించడంలో గ్రామ కార్యదర్శి సాజీద్‌ ఆలీ నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ గ్రామస్థులు సోమవారం గ్రామపంచాయతీలో కార్యదర్శిని నిర్భందించారు. విధులకు సక్రమంగా హాజరు కావడం లేదంటూ ప్రత్యేకాధికారి విజయ్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న విజయ్‌కుమార్‌ గ్రామానికి వచ్చి రెండు రోజుల్లో సమస్యను పరిషరిస్తామని హామీ ఇవ్వడంతో కార్యదర్శిని విడిచి పెట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *