గంగారం జూన్ 12 (జనం సాక్షి)రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు మేరకు సోమవారం నుంచి గంగారం మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాల పునః ప్రారంభం అయ్యాయి కానీ కుమట్లగూడెం లో ఉన్నటువంటి జడ్పీఎస్ఎస్ పాఠశాలలో మాత్రం అరకొర వసతులతో పాఠశాల పున ప్రారంభమైందని మన ఊరు మనబడి కార్యక్రమం కింద పాఠశాల చుట్టూ కాంపౌండ్ వాల్ లక్షల రూపాయలు వెచ్చించి కట్టీనప్పటికీ పాఠశాలలో మాత్రం పిల్లలకు కూర్చోవడానికి కనీస సదుపాయాలు అంటే గదులు కూడా లేకపోవడం ఈ ప్రభుత్వ విద్యాశాఖ పనితీరుకు నిదర్శనం. కలెక్టర్ గత నాలుగు నెలల క్రితం వచ్చినప్పుడు 20 లక్షల రూపాయలను ఇస్తానని చెప్పినప్పటికీ ఇప్పటికీ నిధులు మంజూరు కాక పాఠశాలలో గదుల సంగతి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా మారింది. పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత కూడా ఉన్నట్లు ఆ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు తెలిపారు
సమస్యలతో స్వాగతం పలికిన సర్కారు బడులు




