పెనుబల్లి, జూన్ 12(జనం సాక్షి)తమకు పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వాలనీ కోరుతూమండాలపాడు గ్రామానికి చెందిన డబల్ బెడ్ రూమ్ ఇళ్లకు సంబంధించిన 40 మందిసోమవారం తహశీల్దార్ రమాదేవికి వినతి పత్రం సమర్పించి ధర్నా నిర్వహిం చారు, ఈ సందర్భం గా సిపి ఎం జిల్లా కమిటి సభ్యులు,చలమాల విఠల్, మండల పార్టీ కార్యదర్శి గాయం తిరుపతి రావు లు మాట్లాడుతూ పొజిషన్ సర్టిఫికేట్ లు, కరెంటు, మిషన్ భగీరథ పైప్ లైన్ నుంచి మంచినీరు అందించాలని ఎన్నోసార్లు సంభందిత అధికారుల చుట్టూ తిరిగి గినా పట్టించు కోలేదని, అంతర్గత రహదా రులు సరిగాలేవని, సీసీ రోడ్లు వేయాలని డిమాండ్ చేశారు,తహశీల్దార్ రమాదేవి స్పందిస్తూ రెండు రోజుల్లో పొజిషన్ సర్టిఫికెట్లు ఇస్తా మని,ఎండిఓ మహాలక్ష్మి మంచినీటి సౌకర్యం కల్పిస్తామని హామీ లు ఇవ్వడంతో ధర్నా కార్య క్రమాన్ని విరమించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు మిట్టపల్లి నాగమణి , రైతు సంఘం మండల ఉపాధ్యక్షుడు వెంకటేశ్వరరావు, బలుసు పాటి మోహన్రావు ,రావిలాల సాంబశివరావు ,జి అశోక్ ,జి వెంకటమ్మ, గడ్డం మల్లేశ్వరి ,బి నాగమణి, ఓరుగంటి కృష్ణవేణి ,ధర్మాల వీరమ్మ ,డి ముత్యం ,సుభద్ర ,వెంకటరమణ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
డబల్ బెడ్ రూమ్ ఇళ్ళకు పొజీషన్ సర్టిఫికెట్లు ఇవ్వాలి




