సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వానికి సమ్మె నోటిసు ఇచ్చిన అర్చకులు

హైదరాబాద్‌: సమస్యలు పరిష్కరించాలని అర్చకుల సంఘం ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చింది. దేవాదాయ శాఖ పరిపాలక ఫండ్‌ 65 (ఎ) ద్వారా తమకు వెంటనే జీతాలు చెల్లించాలని ఈ సందర్భంగా అర్చకులు డిమాండ్‌ వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించకపోతే ఆందోళనలు ఉద్థృతం చేస్తామని హెచ్చరించారు.