Tuesday, 3 November 2026

సమస్యల పరిష్కారం కోసం సంగటిత పోరాటాలకు సిద్ధం కావాలి.

 

 

 

 

 

ఐద్వా రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మిజిల్లా కేంద్రంలో ఐద్వా కార్యాలయం ప్రారంభం.రాజన్న సిరిసిల్ల బ్యూరో. జనవరి,29.(జనం సాక్షి). సమస్యల పరిష్కారం కోసం సంఘటిత పోరాటాలకు సిద్ధం కావాలని ఐద్వా రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి పిలుపునిచ్చారు. ఆదివారం సిరిసిల్ల బి వై నగర్ లో ఐద్వా జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించారు. ముందుగా ఐద్వా జెండాను ఆవిష్కరించి కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడారు. మహిళ స్వశక్తి సంఘాలకు రావలసిన పావలా వడ్డీని రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ఇవ్వకపోవడం దారుణమని అన్నారు. అర్హులైన బీడీ కార్మికు లందరికీ జీవన భృతి పెన్షన్లు ఇవ్వాలని, ఇల్లు లేని నిరుపేదలకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టించి ఇవ్వాలని, పోడు భూములు సాగు చేస్తున్న రైతులకు అర్హత పత్రాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సమాజంలో మహిళలపై కొనసాగుతున్న అనిచివేతలపై సంఘటిత పోరాటాలకు సిద్ధం కావాలని అన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు సూరం పద్మ, కార్యదర్శి జువాజి విమల, వడ్ల లక్ష్మి, గట్టు ,స్వప్న, సామల కవిత, కృష్ణవేణి ,శారద, నాగమణి తదితరులు పాల్గొన్నారు.