Tuesday, 3 November 2026

చలో జగిత్యాల సంఘీభావ సభకు తరిలిన మంథని డివిజన్ పద్మశాలి నాయకులు

 

 

 

 

 

 

జనం సాక్షి , రామగిరి :జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్ వేధింపుల ఆరోపణలతో మనస్థాపం చెంది తన పదవికి రాజీనామా చేసిన జగిత్యాల చైర్ పర్సన్ భోగ శ్రావణి కి సంఘీభావంగా పద్మశాలి సంఘం రాష్ట్ర వ్యాప్తంగా మద్ధతు పలికి చలో జగిత్యాల పిలుపునిచ్చి ఏర్పాటు చేసిన సంఘీభావ సభకు ఆదివారం పద్మశాలీ నాయకులు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు. భోగ శ్రావణిని కలిసి సంఘీభావం తెలిపారు. పెద్దపల్లి జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు వేముల రామ్మూర్తి ఆధ్వర్యంలో మంథని డివిజన్ నుండి జిల్లా సంఘం ఉపాధ్యక్షులు కొలిపాక సత్తయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు గూట్ల రమేష్, వేముల కుమారస్వామి తదితర పద్మశాలి నాయకులు పాల్గొన్నారు.