Friday, 6 November 2026

సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యేకు వినతి

సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యేకు వినతి

మునగాల, నవంబర్ 22(జనంసాక్షి): మునగాల మండలంలోని ప్రభుత్వ వైద్యశాల సమస్యలపై, జాతీయ రహదారి సమస్యలు పరిష్కరించాలని స్థానిక శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ కు వినతి పత్రం అందజేయడం జరిగింది . మంగళవారం మండల కేంద్రంలోని కల్యాణలక్ష్మి, శాదీ ముభారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన స్థానిక శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ కు వినతి పత్రం అందజేసిన అనంతరం సిపిఐ మండల కార్యదర్శి చిల్లంచర్ల ప్రభాకర్ మాట్లాడుతూ, మాధవరం నుండి ఆకుపాముల వరకు జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ప్రతి గ్రామంలో రోడ్డుకు ఇరువైపులా సర్వీసు రోడ్ల నిర్మాణం చేపట్టాలని, మండల కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలను సివిల్ హాస్పిటల్ గా ఏర్పాటుచేసి హాస్పిటల్ నందు 24 గంటల వైద్య సదుపాయం కల్పించి పోస్టుమార్టం కూడా స్థానిక వైద్యశాలనందు చేసే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, వైద్యశాలలో మౌలిక వసతులు కల్పించి చుట్టు ప్రహరీ గోడ నిర్మించి వైద్యశాలలో 1033 నేషనల్ హైవే అథారిటీ అంబులెన్స్, 108 అంబులెన్స్ లను ప్రజలకు అందుబాటులో ఉండేటట్లు చర్యలు తీసుకోవాలని, మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ వైద్యశాల ఎదురుగా ఉన్న మసీదు వద్ద అసంపూర్తిగా నిర్మాణం చేసిన సర్వీసు రోడ్డును పునర్ నిర్మించాలని డిమాండ్స్ తో కూడిన వినతి పత్రాన్ని ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ కు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామపెద్దలు నల్లపాటి శ్రీనివాస్, కందిబండ సత్యనారాయణ, యుగంధర్ రెడ్డి, ఉడుం కృష్ణ, జి శివ, పసుపులేటి సందీప్, శెట్టి వెంకీ, బత్తిని సూరి తదితరులు పాల్గొన్నారు.