Thursday, 5 November 2026

సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఎంపీపీకి వినతి

 

 

 

నెన్నెల, ఏప్రిల్ 7, (జనంసాక్షి )ఐకేపీలో పని చేస్తున్న వీవోఏల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని నెన్నెల మండల వీవోఏలు శుక్రవారం ఎంపీపీ సంతోషం రమాదేవికి వినతి పత్రం అందజేశారు. తమ సమస్యల పరిష్కారం కోరుతూ గత అయిదు రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికి తమ సమస్యలు పరిష్కారం కావడం లేదని ఎంపీపీ చొరవ తీసుకొని తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యేలా చొరవ చూపాలని వారు వినతి పత్రంలో కోరారు. ఈకార్యక్రమంలో ఐకేపీ వీవోఏ యూనియన్ మండల అధ్యక్షుడు తైదల సమ్మయ్య, కార్యదర్శి పాదం లక్ష్మణ్, నియోజకవర్గం గౌరవ అధ్యక్షుడు దుర్గం మల్లేష్, వీవోఏలు కవిత, ప్రమీల, గణేష్, పురుషోత్తం, భాగ్య, సంతోష్, స్రవంతి, నిర్మల, భూమన్న, స్వరూప, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.