యాదాద్రి భువనగిరి జిల్లా జనం సాక్షి న్యూస్ ఏప్రిల్ 07యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం లో రెండవ రోజు కొనసాగుతున్న ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి,టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బీర్ల అయిలయ్య హాత్ సే హాత్ పాదయాత్ర.తుర్కపల్లి మండలంలోని దయ్యం బండ,మంచిరోని మామిల్లు,గ్రామాల్లో కొనసాగింది.అనంతరం తుర్కపల్లి,ముల్కలపల్లి,జైతురం తండా,గ్రామల వరకు కొనసాగనుంది.ఈ సందర్భంగా ప్రతి గడపకు వెళ్లి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకోవాలని కోరారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 500 కే గ్యాస్ అందిస్తామని ప్రజలకు వివరించారు.ఈ సందర్భంగా బీర్ల అయిలయ్య మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి మా ఫౌండేషన్ ద్వారా వాటర్ క్యాన్లు అందజేస్తామని తెలిపారు.ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో వాటర్ ప్లాంట్ లు ఏర్పాటు చేశామని తెలిపారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే మళ్ళీ అభివృద్ధి జరుగుతుందని తెలిపారు.తెలంగాణ వస్తే అభివృద్ధి జరుగుతుందనుకుంటే ప్రజలు ఎలాంటి న్యాయం చేయలేదన్నారు.ప్రతి గ్రామంలో గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్లులే ఉన్నాయని తెలిపారు.మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం రావాలని వస్తే ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేస్తామని తెలిపారు. బీర్ల ఫౌండేషన్ తో నియోజకవర్గంలో అనేక రకాలుగా సేవ కార్యక్రమాలు చేస్తున్నామని,నాలుగు అంబులెన్స్ ల తో ఎవరికి ప్రమాదం జరిగిన వారిని ఆస్పత్రికి చేర్చుతున్నామని తెలిపారు.




