Friday, 6 November 2026

సమస్యల పరిష్కారానికై డయల్ యువర్ చైర్ పర్సన్ మంజుల రమేష్

గురువారం డయల్ యువర్ చైర్ పర్సన్ కార్యక్రమానికి 13 ఫిర్యాదులు.వికారాబాద్ రూరల్ మార్చి 16 జనం సాక్షిపట్టణ ప్రజల సమస్యల పరిష్కారానికై ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న డయల్ యువర్ చైర్ పర్సన్ కార్యక్రమానికి ఈవారం కూడా 13 ఫిర్యాదులు వచ్చాయని వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ తెలిపారు. కార్యక్రమం అనంతరం చైర్ పర్సన్ మాట్లాడుతూ గతవారం డయల్ యువర్ చైర్ పర్సన్ కార్యక్రమానికి 13 ఫిర్యాదులు రాగా, వాటిలో 3 సమస్యలు పూర్తిగా పరిష్కరించడం జరిగిందని, ఒకటి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కు సంబంధించినది కాగా మిగతావి అండర్ ప్రాసెస్ లో ఉన్నాయని, మరికొన్ని నిధులతో కూడిన సమస్యలు ఉన్నాయని తెలిపారు. ఈవారం కూడా 13 ఫిర్యాదులు రాగా వాటిలో ప్రధానంగా డ్రైనేజ్, శానిటేషన్, వీధిలైట్ల సమస్యలు ఉన్నాయని వాటిని కూడా త్వరలోనే పరిష్కరిస్తామని వెల్లడించారు.