Tuesday, 3 November 2026

సమాజంలో మార్పునకు..  విద్యార్థులు మూలంకావాలి

– ఆడ పిల్లల విద్యకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత
– ఉన్నత చదువులు చదివి రాష్టాన్రికి మంచిపేరు తేవాలి
– రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌
హైదరాబాద్‌, సెప్టెంబర్‌24 జనం సాక్షి  :  సమాజంలో మార్పునకు విద్యార్థులు మూలం కావాలని, తామొక్కరిమే ఎదిగితే చాలని అనుకోకుండా మనచుట్టూ ఉన్నవారి ఎదుగుదలకు మనం సహాయకారులుగా మారాలని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. మంగళవారం ఎన్‌ఎస్‌ఎస్‌ స్వర్ణోత్సవాల సందర్భంగా బేగంపేటలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మంత్రి సత్యవతి రాథోడ్‌ ప్రత్యేక అతిధిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కేసిఆర్‌ నాయకత్వంలో ఆడపిల్లల చదువులో, పోషణలో, మహిళా సంక్షేమంలో అనేక పథకాలు తీసుకొచ్చి వారికి అన్నగా అండగా ఉంటోందని అన్నారు. నాడు విద్య కోసం తాను పడిన కష్టాలను గుర్తు చేసుకుని, నేడు సిఎం కేసిఆర్‌ విద్య కోసం చేస్తున్న పనులను మంత్రి సత్యవతి రాథోడ్‌ వివరించారు. తాను ఒక చిన్న తండాలో పుట్టానని, అక్కడ స్కూల్‌ లేకపోయినా వేరే ఊరికి నడిచి వెళ్లి ఏడో తరగతి వరకు చదువుకున్నానని తెలిపారు. అప్పట్లో హాస్టళ్లు ఎక్కువగా లేకపోవడంతో తన తల్లిదండ్రులు చదివించలేక ఏడో తరగతి పాసైన తర్వాత వారం రోజులకు పెళ్లి చేశారన్నారు. తన తండాలోని గిరిజన కుటుంబంలో అప్పట్లో ఏడో తరగతి చదువుకున్న నేనే మొదటి అమ్మాయిని చెప్పారు. అయినా చదువు లేకపోవడం వల్ల ఉండే కష్టాన్ని గుర్తించి, మొదటిసారి మా ఊరికి సర్పంచ్‌ అయ్యానపుడు హైస్కూల్‌ తీసుకొచ్చానన్నారు. ఆ తర్వాత ఎమ్మెల్యే అయ్యాక నాలాగా మిగిలిన వారు నష్టపోకూడదని నా ప్రాంతానికి, నా నియోజక వర్గానికి పాఠశాలలు, కాలేజీలు తీసుకొచ్చే ప్రయత్నం చేశానన్నారు. సీఎం కేసిఆర్‌ నాయకత్వంలో రాష్ట్రంలో శిశువులు, మహిళలకు అనేక పథకాలు అమలవుతున్నాయన్నారు. తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి బిడ్డకు పోషకాహారం ఇవ్వడం, గర్భిణీ స్త్రీలు పనిచేయకుండా ఇంటి వద్దే ఉండే ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మనివ్వడం కోసం ఆరు నెలల పాటు నెలకు రెండువేల రూపాయలు ఆర్ధిక సాయం, ఆడపిల్ల పుడితే మరో వెయ్యి రూపాయలు అదనంగా ఇవ్వడం, ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవం జరిగిన వారికి తల్లీ, బిడ్డలకు కావల్సిన అన్ని సరుకులతో కేసిఆర్‌ కిట్‌ ఇవ్వడం, పిల్లలు ఆరోగ్యకరంగా పెరిగేందుకు అంగన్‌ వాడీల ద్వారా వ్యాక్సిన్లు, మందులు, పోషకాహారం అందించడం, వారు పెరిగిన తర్వాత నాణ్యమైన విద్య కోసం గురుకులాలు ఏర్పాటు చేయడం, విదేశాల్లో విద్యఅభ్యసించడం కోసం 20లక్షల రూపాయల స్కాలర్‌ షిప్‌ అందించడం, ఆడపిల్ల పెళ్లి కోసం కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్‌ ద్వారా 1,00,116 ఇవ్వడం, ఇండ్లు, రేషన్‌ కార్డులు అన్ని మహిళల పేరువిూదనే చేయడం వంటి అనేక మహిళా, శిశు సంక్షేమ పథకాలు సిఎం కేసిఆర్‌ తీసుకొచ్చి, అమలు చేస్తున్నారని వివరించారు. విూకు విూరు కాకుండా నలుగురికి ఉపయోగపడేలా సేవాభావాన్ని కలిగి ఉండాలని, పర్యవరణాన్ని పరిరక్షించి, రాష్టాన్రికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి కేసిఆర్‌ నేతృత్వంలో ఇటీవల ప్రభుత్వ పాఠశాలలో వసతుల కల్పన పెరిగిందని, నాణ్యమైన విద్య అందుతోందని అన్నారు. దీనికి విూ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ జి. యాదగిరి చెప్పినట్లు గత ఏడాది కంటే ఈ సంవత్సరం విద్యార్థుల సంఖ్య రెట్టింపు కావడం నిదర్శనమన్నారు. ఇక్కడ భవనం కోసం కొంత నిధులు ఇస్తే పూర్తవుతుందని కాలేజీ ప్రిన్సిపాల్‌ నా దృష్టికి తీసుకొచ్చారని, దీనిని విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి నిధులు తొందరగా వచ్చే విధంగా నేను ప్రయత్నం చేస్తానని చెప్పారు. తన శాఖాపరంగా కోచింగ్‌ సెంటర్‌, హాస్టల్‌ బిల్డింగ్‌ గిరిజన బాలికల
కోసం ఇవ్వమని కోరారు. కాబట్టి తప్పకుండా ఈ రెండింటి కోసం ముఖ్యమంత్రి కేసిఆర్‌ మాట్లాడి నా వంతు కృషి చేస్తానని హావిూ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కార్పోరేటర్‌ కుమారి ఉప్పల తరుణి, ప్రోగ్రామ్‌ ఆఫీసర్లు డాక్టర్‌ కే వెంకటేశ్వర్లు, సి ఉమామహేశ్వరి, కే సరితారాణి, ఏ మాధురితో పాటు పలువురు పాల్గొన్నారు.