సమాజ్‌వాది పార్టీ నేత హత్య
గ్రేటర్ నోయిడా: సమాజ్ వాది పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు చమన్ భాటిని దుండగులు బుధవారం గ్రామంలోని ఆయన ఇంటిదగ్గరే కాల్చిచంపారని పోలీసులు గురువారం పేర్కొన్నారు. నిన్న భాటి గన్‌మెన్‌లు ఇద్దరూ సెలవులో ఉన్న సమయం చూసి దుండగులు గోడ దూకి ఇంట్లోకి ప్రవేశించి ఈ దారుణానికకి పాల్పడ్డట్లు సమాచారం. భాటి హంతకులను వెంటనే అరెస్టు చేయాలంటూ గ్రామస్థులు గురువారం ఆందోళన చేపట్టారు. స్థిరాస్తి వ్యాపారంలో ఉన్న భాటికి ప్రాణహాని భయం ఉండడంతో గన్‌మెన్లను కేటాయించారు.