Wednesday, 4 November 2026

పోలీసుస్టేషన్‌ ఎదుట దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి

కృష్ణా : కంకిపాడు పోలీసుస్టేషన్‌ ఎదుట దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి. దేవరపల్లి రవితేజ హత్య కేసులో నిందితులను శిక్షించాలని దళితులు డిమాండ్‌ చేశారు. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం పునాదిపాడు గ్రామంలో అర్థరాత్రివేళ అన్నాచెల్లెళ్లు ఇంటికి వెళుతుండగా మద్యం తాగిన ముగ్గురు యువకులు చెల్లెల్ని ఏడ్పించారు. అడ్డుకున్న సోదరుడు రవితేజను ద్విచక్రవాహనంతో ఢీకొట్టారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *