Thursday, 5 November 2026

సమిష్టి కృషితోనే అభివృద్ధి : శామీర్ పేట్

సమిష్టి కృషితోనే అభివృద్ధి : శామీర్ పేట్, జనం సాక్షి :
ప్రభుత్వ అధికారులు సమాచారమీడియా సమన్వయంతోనే జిల్లా అభివృద్ధి పరుగులు పెడుతుందని మేడ్చల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ అభిమన్యు అగస్త్య పేర్కొన్నారు. గురువారం, మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో, జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన అభిమన్యు అగస్త్యను తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు బొమ్మ అమరేందర్ ఆధ్వర్యంలో కార్యవర్గ సభ్యులoతా. మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కతో శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.. ఈ కార్యక్రమంలో , తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ మల్కాజ్గిరి, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు విల్సన్ ప్రధాన కార్యదర్శి, గిరి గౌడ్, మాజీ అధ్యక్షులు మురళి, అల్వాల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు సుక్క రవి, యూనియన్ నాయకులు, వాసు అర్జున్,తదితరులు పాల్గొన్నారు.
17ఎస్పీటీ -1: కలెక్టర్ ను శుభాకాంక్షలు తెలుపుతున్న యూనియన్ నాయకులు