యాదగిరి ప్రసాద్ కు డా. బి. ఆర్. అంబేద్కర్ నేషనల్ అవార్డు
వరంగల్ ఈస్ట్, నవంబర్ 17(జనం సాక్షి)
బహుజన సాహిత్య అకాడమీ
సంస్థ నిర్వహించిన బహుజన రైటర్స్ 3వ ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ గర్హ తాళ్ భవన్ కరోల్ బాగ్ న్యూ ఢిల్లీ లో నిర్వహించినారు. కార్యక్రమంలో ముఖ్య అథిదులుగా డా.ఎల్. హన్మంతయ్య ఎం. పి. రాజ్యసభ సభ్యులు. విశేష్ రవిజి ఎం. ఎల్. ఏ. విజయ్ కుమార్ రవి ప్రెసిడెంట్ ఢిల్లీ వికాస్ సంస్థ.అడ్వకేట్ సుప్రీం కోర్ట్. బి. సీతామహాలక్ష్మీ మహిళా విభాగ జాతీయ సెక్రెటరీ నల్లరాధాకృష్ణ జాతీయ అధ్యక్షులు మరియు నూకల వెంకటేశ్వర్ రెడ్డి సమక్షంలో తెలంగాణా రాష్ట్రం నుండి పోలేపక యాదగిరి ప్రసాద్ ని డా. బి. అర్ అంబేద్కర్ నేషనల్ అవార్డుతో సత్కరించారు ఈ సందర్భంగా గాయకులు.లింగాల ఇమ్మానియెల్.సకలకళా సంస్కృతిక మండలి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు గడ్డం సుధాకర్.కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి నాయకులు ఆరూరి కుమార్, శాస్త్రీయ జానపద నాట్య గురువులు పోలెపాక భుజంగరావు తదితరులు శుభాకాంక్షలు తెలియజేసినారు.




