కొండమల్లేపల్లి ఏప్రిల్ 12 జనంసాక్షి న్యూస్ : కొండమల్లేపల్లి పట్టణానికి చెందిన పార్ బాయిల్డ్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సముద్రాల వెంకన్న మాతృమూర్తి సముద్రాల లక్ష్మమ్మ (78) కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం నాడు తుది శ్వాస విడిచారు సముద్రాల లక్ష్మమ్మ శివైక్యం చెందారన్న విషయం తెలుసుకున్న శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మరియు దేవరకొండ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ నాయక్ సముద్రాల వెంకన్న ఇంటికి చేరుకుని సముద్రాల లక్ష్మమ్మ పార్థివదేహానికి శ్రద్ధాంజలి ఘటించారు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సముద్రాల లక్ష్మమ్మ పార్థివ దేహం పై పుష్పగుచాన్ని ఉంచి నివాళులు అర్పించారు అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చి వారికి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు దేవరకొండ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ నాయక్ సముద్రాల లక్ష్మమ్మ పార్థివ దేనికి శ్రద్ధాంజలి ఘటించి వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడిని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు ఈ కార్యక్రమంలో దేవరకొండ మున్సిపల్ చైర్మన్, పార్ బాయిల్డ్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు ఆలంపల్లి నరసింహ, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు కేసాని లింగారెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు కుంభం శ్రీనివాస్ గౌడ్, జడ్పిటిసి సలహాదారు పసునూరు యుగేందర్ రెడ్డి, ఎంపీపీ మంచికంటి వెంకటేశ్వర్లు, ఉప సర్పంచ్ గంధం సురేష్, మాజీ మున్సిపల్ చైర్మన్ వడ్త్య దేవేందర్ నాయక్,మాడ్గుల యాదగిరి, రాంబాబు నాయక్, వీరమళ్ల కిరణ్ కుమార్, కండె రామకృష్ణ,కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు వేమన్ రెడ్డి, టిడిపి మండల పార్టీ అధ్యక్షుడు కోట్ల జగదీష్, పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రముఖులు, ఆర్యవైశ్య సంఘం సభ్యులు, పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రద్ధాంజలి ఘటించారు




