Tuesday, 3 November 2026

సమ్మె నోటీసు ఇచ్చిన విఓఏలు.

ఫొటో : సమ్మె నోటీసు ఇచ్చిన విఓఏలు.
బెల్లంపల్లి, ఏప్రిల్ 3, (జనంసాక్షి )
ఐకేపీలో పనిచేసే విఓఏలు సోమవారం ఏపీఎం విజయలక్ష్మికి సమ్మె నోటీసులు అందజేశారు. ఐకేపీ వీవోఏల యూనియన్ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సమ్మెకు దిగినట్లు అధ్యక్షుసూపర్ తైదల సమ్మయ్య తెలిపారు. వీవోఏలకు 26,000 వేల గౌరవ వేతనం, పీఆర్సి అమలు చేయాలని, వీవోఏలను సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించాలని, ప్రమాద భీమా 20 లక్షలు చెల్లించాలని, ఆరోగ్య భీమా 10 లక్షలు కల్పించాలని, వీవోఏలకు గుర్తింపు కార్డులు ఇవ్వాలనే డిమాండ్లపై సమ్మె నోటీసు ఇచ్చినట్లు వివరించారు. ఈకార్యక్రమంలో వీవోఏ ప్రధాన కార్యదర్శి పాదం లక్ష్మణ్, నియోజకవర్గ గౌరవ అధ్యక్షుడు దుర్గం మల్లేష్, నియోజకవర్గ ఉపాధ్యక్షురాలు చుంచుల మల్లేశ్వరి, వీవోఏలు ఉషన్న, గణేష్, పురుషోత్తం, భాగ్య, సంతోష్, స్రవంతి, నిర్మల, భూమన్న, స్వరూప, తదితరులు పాల్గొన్నారు.