సీమంతాలు, అన్నప్రాసన, అక్షరాభ్యాసాలు టేకులపల్లి,ఏప్రిల్ 3( జనం సాక్షి): ఐసిడిసి ఆధ్వర్యంలో ముమ్మరంగా కొనసాగుతున్న పోషణ పక్షం కార్యక్రమంలో భాగంగా టేకులపల్లి సెక్టార్ నందు టేకులపల్లి -2 సెంటర్లో పోషణ పక్షం కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టేకులపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ బోడా సరిత హాజరై ఈ కార్యక్రమంలో భాగంగా గర్భిణీలకు సీమంతాలు, పిల్లలకు అన్నప్రాసన,అక్షరాభ్యాసాలు ఆమె చేతుల మీదుగా చేశారు. ఈ కార్యక్రమంలో తల్లులకు చిరుధాన్యాల పై అవగాహన కల్పించి,అలాగే వారి రోజువారి వంటకాలలో చిరుధాన్యాలను ఉపయోగించాలని సలహాలు, సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి టేకులపల్లి గ్రామపంచాయతీ కార్యదర్శి కిరణ్, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు బానోతు లక్ష్మ,రవీందర్, తల్లులు, గర్భిణీ స్త్రీలు, పిల్లలు, అంగన్వాడి టీచర్లు పాల్గొన్నారు.
సీమంతాలు, అన్నప్రాసన, అక్షరాభ్యాసాలు




