సర్పంచ్ ఆధ్వర్యంలో అక్రమ కట్టడాలు

చౌడాపూర్,ఆగస్టు 20(జనం సాక్షి): వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండల కేంద్ర పరిధిలోని మందిపాల్ గ్రామంలో దళితులకు చెందిన భూమిలో గ్రామ పంచాయతీ కార్యదర్శి,కారోబార్ మరియు గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో ఎలాంటి అనుమతులు లేకుండా గ్రామ సర్పంచ్ బీసీ వర్గానికి చెందిన అనుచరులుకు అక్రమంగా,దౌర్జన్యంగా ఇండ్లు కట్టుకోవడానికి ప్రోత్సహిస్తున్నారని ఆ భూమికి చెందిన కుటుంబ వారసులందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇట్టి విషయాన్ని గ్రామపంచాయతీ కార్యదర్శికి ఎన్నిసార్లు అడిగినా నాకు ఏమి తెలియదు అంతా గ్రామ సర్పంచ్ కె తెలుసు అని ఒకరిపై ఒకరు చెబుతూ అక్రమ కట్టడాలను అధికారులే స్వయంగా ప్రోత్సహిస్తున్నరు అని అన్నారు.ఇప్పటికైనా పై అధికారులు స్పందించి మా భూములు మాకు ఇప్పించాలని ఆ భూమికి సంబంధించిన కుటుంబ వారసులందరూ పై అధికారులను వేడుకుంటున్నారు.