సర్వలోక రక్షకుడు ఏసు క్రీస్తు”
ఫోటోరైటఫ్: చర్చిలు దుస్తులు పంపిణీ చేస్తున్న ఎంపిపి బిక్షం,జెడ్పిటిసి అనిత
పెన్ పహాడ్. డిసెంబర్ 16 (జనం సాక్షి) : సర్వలోక రక్షకుడు యేసు క్రీస్తు ఈ భూమి మీద 2022 సంవత్సరాల క్రితమే అవతరించాడని ఆయన పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించుకోవలని ఎంపిపి నేమ్మాది బిక్షం, జెడ్పిటిసి మామిడి అనిత అంజయ్య అన్నారు ఈనెల 25న నిర్వహించే క్రిష్మస్ పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీద క్రైస్తవులకు అందిస్తున్న దుస్తులను మండల కేంద్రంలోని తెలుగు బాపిస్టు చర్చి లో మండల ఫెలోషిప్ ఆధ్వర్యంలో ప్రారంభించి మాట్లాడారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా అన్ని మతాలకు కులాలకు సమాన ప్రాతినిధ్యం వహిస్తున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకళ్ల జగదీష్ రెడ్డి సూర్యాపేట పట్టణంలో క్రైస్తవుల సమాధుల తోటకు రూ.40 లక్షల నిధులు కేటాహించి వారి అభివృద్ధి కృషి చేశారని అదేవిదంగా ఆయన సహకారంతో మండల కేంద్రంలో కూడా క్రైస్తవుల సమాధులతోటకు ఎకరం భూమినీ కేటహించనున్నట్లు తెలిపారు గ్రామాల్లో కూడా అదేవిదంగా చేపడతామని హామీ ఇచ్చారు ప్రతి ఒక్కరు క్రిష్మస్ పండుగను జరుపుకోవాలని కోరారు ఈకార్యక్రమంలో తహశీల్దార్ శేషగిరిరావు, ఇంచార్జ్ ఎంపీడీవో బాణాల శ్రీనివాసు, ఎంపీటీసీ ఊరుకొండ జానకమ్మ రాధాకృష్ణ, మండల బిఆర్ఎస్ అధ్యక్షులు దొంగరి యుగేందర్, నాయకులు దాసరి శ్రీనివాసు, ఓగ్గు గోపి,మండల పాస్టర్ల పెల్లోషిప్ అధ్యక్షుడు పేరాల రాజరత్నం, ఉపాధ్యక్షులు పొడపంగి సునీల్ బాబు ,పాస్టర్ల ఇమ్మనుయేలు, ఆంటోనీ, ఎలిషా రాజు యేసు రత్నం, సంగం అధ్యక్షులు వగ్గు సామిల్ క్రైస్తవులు తదితరులు పాల్గొన్నారు.




