Thursday, 5 November 2026

జాతీయ,రాష్ట్ర స్థాయికి ఎంపికైన గాంధారి క్రీడాకారులు

జాతీయ,రాష్ట్ర స్థాయికి ఎంపికైన గాంధారి క్రీడాకారులు

 

గాంధారి డిసెంబర్ ( జనంసాక్షి)17
కృషి ఉంటే మనుషులు రుషులవుతారు అనే నానుడిని అక్షర సత్యం చేసిన ఈ క్రీడాకారులను చూస్తే ఏమాత్రం తీసిపోయినట్టుగా ఉంది.
జాతీయ స్థాయి సీనియర్ షూటింగ్ బాల్ పోటీలకు గాంధారి మండలంలోని రాంపూర్ గడ్డకు చెందిన రాత్లా శ్రీను సబ్ జూనియర్ కామారెడ్డి జిల్లా షూటింగ్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు సాయికుమార్, ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ రాథోడ్ తెలిపారు. జనవరి 9,10.11వ తేదీలో మహబూబాబాద్ జిల్లా కేశముద్రంలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీలో అద్భుత క్రీడా ప్రదర్శన చేయడంతో నిర్వాహకులు ఆయనను జాతీయ స్థాయి కి ఎంపిక చేసినట్లు తెలిపారు. సబ్ జూనియర్ కబడ్డీ పోటీలకు సోమరం తండా కు చెందిన మాలోత్ వెన్నెల రాష్ట్ర స్థాయికి ఎంపికైనట్లు లక్ష్మణ్ రాథోడ్ తెలిపారు ఇంద్ర గాంధీ క్రీడా మైదానంలో డిసెంబర్ 8 తేదీన జరిగిన ఎంపిక పోటీల్లో అద్భుత క్రీడా ప్రదర్శనతో ఆమెను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేశారు అని అన్నారు. ఇదే డిసెంబర్ 16 నుండి 19 వరకు మంచిర్యాల జిల్లా క్రీడా మైదానంలో జరుగుతున్న రాష్ట్రస్థాయి పోటీల్లో కామారెడ్డి జిల్లాకు ప్రాతినిథ్యం వహిస్తుంది అని అన్నారు. త్వరలో రాజస్థాన్ రాష్ట్రంలో జరగనున్న జాతీయ స్థాయి పోటీల్లో తెలంగాణా రాష్ట్రం కు ప్రాతినిధ్యం రాట్ల శీను వహిస్తాడని మారుమూల తండా నుండి జాతీయ ఎంపిక కావడం పట్ల గిరిజనులు, గ్రామస్తులు
ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.